వర్గీకరణ: వర్గీకరణ కోసం పదవిని వదులుకునేందుకు సిద్ధమే: ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు

  • పదవులు ముఖ్యం కాదు
  • వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తా
  • ఆయన్ని అడ్డుకుంటే నా పదవికి రాజీనామా చేస్తా

ఎస్సీ వర్గీకరణ కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, వర్గీకరణ కన్నా పదవులు ముఖ్యం కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

 కాగా, కవి గుర్రం జాషువా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కిషోర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుర్రం జాషువా తండ్రి యాదవ, తల్లి మాదిగ కులస్తురాలని, మాదిగల మాదిరి యాదవులు స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News