సదావర్తి: ‘సదావర్తి’ భూములను చౌకగా కొట్టేయాలని తెనాలి ఎమ్మెల్యే యత్నించారు: వైసీపీ నాయకుడు శివకుమార్

  • ఎమ్మెల్యే ఆలపాటి రాజాపై అన్నాబత్తుని ఆరోపణలు
  • అవసరమైతే ఆధారాలతో సహా నిరూపిస్తా
  • సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్న ఆయన ‘ఆల్ పార్టీ రాజా’

తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజాపై వైసీపీ నాయకుడు ఆరోపణలు గుప్పించారు. ‘సదావర్తి’ భూములను చౌకగా దక్కించుకోవాలని ఆలపాటి రాజా విశ్వప్రయత్నం చేశారని, అవసరమైతే ఆధారాలతో సహా నిరూపిస్తానని తెనాలి వైసీపీ ఇన్ చార్జ్ అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్యేలతో నాడు మంతనాలు కూడా జరిపారని, సంపాదనే ధ్యేయంగా పని చేసే ఆలపాటి రాజాను ‘ఆల్ పార్టీ రాజా’గా పిలుస్తారని విమర్శించారు. సదావర్తి భూముల వేలం సమయంలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో కూడా ఆలపాటి పాల్గొనలేదని, తెనాలిలో భూ కబ్జాలకు, సెటిల్మెంట్ లకు ఆయన పాల్పడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News