యశ్వంత్ సిన్హా: యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలు తప్పయితే నిరూపించండి: కేంద్రానికి ‘శివసేన’ సవాల్

  • యశ్వంత్ కు మద్దతు పలికిన ‘శివసేన’
  • కేంద్రానికి ధైర్యముంటే ఆ వ్యాఖ్యలు తప్పని నిరూపించాలి

పెద్దనోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ అమలుపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఈ వ్యాసం నేపథ్యంలో సొంత పార్టీ నేతల్లో కొందరు ఆయనపై మండిపడుతుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు యశ్వంత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

తాజాగా, యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన వారిలో శివసేన పార్టీ కూడా చేరింది. ఆ వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పులేదని, కేంద్ర ప్రభుత్వానికి కనుక ధైర్యముంటే అవి తప్పని నిరూపించుకోవాలని ‘శివసేన’ సవాల్ విసిరింది. కాగా, శివసేన పార్టీ పత్రిక సామ్నాలో కూడా ఇటీవల ఓ వ్యాసం ప్రచురితమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వానమైన పరిస్థితిని ప్రభుత్వం తెలుసుకోలేకపోతోందని, ఈవీఎంల టాంపరింగ్ చేయడం ద్వారా, డబ్బులు పంచడం ద్వారా ఎన్నికల్లో గెలవవచ్చని కొందరు అనుకుంటున్నారంటూ ఆ వ్యాసంలో తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News