స్పైడర్: ఆ కొత్త‌ బ‌స్టాప్ నిండా మ‌హేశ్ బాబు కొత్త సినిమా పోస్టర్లే.. ఫొటోలు వైరల్!

  • గుంటూరులోని బుర్రిపాలెం గ్రామంలో కొత్త బస్టాప్
  • గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ బాబుపై గ్రామస్తుల అభిమానం
  • ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
  • ఆ బ‌స్టాప్‌ని ‘గ్రామం’ ఫౌండేషన్‌ తరఫున కట్టించారన్న నమ్రత

గుంటూరులోని బుర్రిపాలెం గ్రామంలో ఇటీవ‌ల నిర్మించిన బ‌స్టాప్ వ‌ద్ద‌కు వెళ్లి చూస్తే అన్నీ మ‌హేశ్ బాబు కొత్త సినిమా స్పైడ‌ర్ పోస్టర్లే కనపడుతున్నాయి. ఆ గ్రామాన్ని మ‌హేశ్ బాబు ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కొత్త సినిమాపై ఆ గ్రామ వాసులు అమితాస‌క్తి క‌న‌బ‌ర్చుతున్నారు. ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోల‌ను మ‌హేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ బ‌స్టాప్‌ని ‘గ్రామం’ ఫౌండేషన్‌ తరఫున కొత్తగా కట్టించార‌ని తెలిపారు. సమయానికి నిర్మాణ పనులు పూర్తయ్యాయ‌ని చెప్పారు.  

  • Loading...

More Telugu News