టీటీడీ: టీటీడీ కొత్త చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్ పేరు ఖరారు

  • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు  
  • భక్తులకు మెరుగైన సేవలందిస్తా: సుధాకర్ యాదవ్

తిరుమల తిరుపతి దేవస్థానంల (టీటీడీ) కొత్త చైర్మన్ గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనే విషయమై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు ఈ రోజుతో తెరపడింది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ ను టీడీపీ నేతలు అభినందించారు.

ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ గా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, టీటీడీ పాలకమండలి కొత్త సభ్యులను కూడా ఖరారు చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News