దసరా: దుబాయ్ పర్యటనలో రోజా బిజీ బిజీ.. దసరా శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే
- ‘ఫేస్ బుక్’ ఖాతాలో వీడియోలు, ఫొటోలు పోస్ట్
- దుబాయ్ క్రీక్ హార్బర్ లో బోటింగ్ కు వెళ్లామన్న రోజా
దసరా పండగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ‘మీకు, మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలు’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్న రోజా, అమ్మ వారి ఫొటోను పోస్ట్ చేశారు.
కాగా, ప్రస్తుతం రోజా కుటుంబ సభ్యులు దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా దుబాయ్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె పోస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం దుబాయ్ లోని తన ఫ్రెండ్ ఇంట్లో లంచ్ చేసిన ఫొటోలు, దుబాయ్ క్రీక్ హార్బర్ లో బోటింగ్ కు వెళ్లిన వీడియో, తన పిల్లలతో కలిసి దిగిన మరికొన్ని ఫొటోలను రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పొందుపరచడం గమనార్హం.