తలసాని: తెలంగాణలో ‘కాంగ్రెస్’ అధికారంలోకి రావడం కల్ల!: మంత్రి తలసాని

  • కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు
  • హైదరాబాద్ అభివృద్ధిపై ఆ పార్టీ నేతలు ఎన్నడైనా ఆలోచించారా? 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, గెలవడం కల్ల అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.

 ‘గ్రేటర్’ ఎన్నికల్లో రెండు సీట్లు కూడా సాధించలేకపోయారని దెప్పి పొడిచారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఈ సందర్భంగా తలసాని అన్నారు. తెలంగాణ సచివాలయం తరలింపు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News