కేరళ సీఎం: మహిళల కష్టాలు తెలియాలంటే మీరూ చీర కట్టుకుని తిరగాలి: కేరళ సీఎంతో వామపక్ష నాయకురాలు గౌరి అమ్మ
- రాత్రి పది అయినా ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లే దాన్ని
- ఇప్పటి పరిస్థితులు మారిపోయాయి
- తొంభై ఎనిమిదేళ్ల సీపీఐ నాయకురాలు గౌరి అమ్మ
‘మహిళల కష్టాలు తెలియాలంటే మీరూ చీరకట్టుకుని తిరగాలి’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో తొంభై ఎనిమిదేళ్ల కమ్యూనిస్ట్ నాయకురాలు గౌరి అమ్మ వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాత్రి పదిగంటల తర్వాత కూడా ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేదాన్నని, ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయని అన్నారు.
తిరువనంతపురంలో నిన్న జరిగిన సీపీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఓ జ్ఞాపికను అందజేశారు. కాగా, 1957లో కేరళలో ఏర్పాటైన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో గౌరి అమ్మ సభ్యురాలు. 2001 నుంచి 2006 వరకు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఆమె పని చేశారు.