క్రికెట్: వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

  • 119 బంతుల్లో 124 ప‌రుగులు చేసిన డేవిడ్ వార్న‌ర్
  • 96 బంతుల్లో 94 పరుగులు చేసిన ఫించ్
  • ప్రస్తుతం క్రీజులో ట్రవిస్ హెడ్, స్మిత్

భార‌త్‌, ఆస్ట్రేలియా మధ్య జ‌రుగుతోన్న‌ నాలుగో వ‌న్డే మ్యాచ్ లో క్రీజులో పాతుకుపోయిన‌ ఆసీస్ ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ల జంట‌ను ఎట్ట‌కేల‌కు టీమిండియా బౌల‌ర్ కేదార్ జాద‌వ్ విడ‌గొట్టాడు. 119 బంతుల్లో 124 ప‌రుగులు చేసిన డేవిడ్ వార్న‌ర్ భారీ షాట్‌కి ప్ర‌య‌త్నించి, అక్స‌ర్ ప‌టేల్‌కి క్యాచ్ ఇచ్చుకున్నాడు. డేవిడ్ వార్న‌ర్‌కి వ‌న్డేల్లో ఇది 14 వ సెంచ‌రీ. ఆ వెంటనే తదుపరి ఓవర్ లో ఫించ్ 94 (96 బంతుల్లో) ని ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ట్రవిస్ హెడ్, స్మిత్ ఉన్నారు. ఆసీస్ స్కోరు 36 ఓవర్లకి 232గా ఉంది.   

  • Loading...

More Telugu News