క్రికెట్: సెంచరీతో అదరగొట్టిన వార్నర్... భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా

  • 3 సిక్సులు, 10 ఫోర్ల సాయంతో 102 బంతుల్లో శ‌త‌కం 
  • క్రీజులో పాతుకుపోయిన వార్న‌ర్ (103), ఫించ్ (82) 
  • ఆస్ట్రేలియా స్కోరు 31 ఓవ‌ర్ల‌కి 197

బెంగళూరు వేదిక‌గా జరుగుతోన్న భార‌త్‌, ఆస్ట్రేలియా నాలుగో వ‌న్డే మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ధాటిగా ఆడుతోన్న వార్న‌ర్.. 3 సిక్సులు, 10 ఫోర్ల సాయంతో 103 బంతుల్లో శ‌త‌కం బాదాడు. ప్ర‌స్తుతం క్రీజులో వార్న‌ర్ 103, ఫించ్ 82 ప‌రుగుల‌తో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 31 ఓవ‌ర్ల‌లో 197గా ఉంది. 30 ఓవ‌ర్లు దాటిన‌ప్ప‌టికీ టీమిండియా బౌల‌ర్లు ఒక్క వికెట్టు కూడా ప‌డ‌గొట్ట‌క‌పోవ‌డంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. క్రీజులో పాతుకుపోయిన ఫించ్‌, వార్నర్‌లు టీమిండియా బౌల‌ర్ల ఓపిక‌ను ప‌రీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News