క్రికెట్: ధాటిగా ఆడుతూ 100 మార్కు స్కోరును దాటించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు
- ఆస్ట్రేలియా స్కోరు 16 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 101
- ఫించ్ 42, వార్నర్ 53 పరుగులు
- టఫ్ ఫైట్ ఉంటుందన్న పరిశీలకులు
బెంగళూరు వేదికగా జరుగుతోన్న భారత్, ఆస్ట్రేలియా నాలుగో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ధాటిగా ఆడుతోంది. ఆసీస్ ఓపెనర్లు ఫించ్, వార్నర్ చూడచక్కని షాట్లను కొడుతూ 100 మార్కు స్కోరును దాటించారు. వార్నర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫించ్ 42, వార్నర్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 16 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 101గా ఉంది. ఈ మ్యాచ్‌లోనయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో టఫ్ ఫైట్‌ను చూడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.