ఓలా: హైదరాబాద్‌లో మహిళను వేధించిన ఓలా క్యాబ్ డ్రైవర్.. అరెస్ట్ చేసిన షీ టీమ్స్!
- మొబైల్ నంబర్ ఇవ్వమని అడిగిన క్యాబ్ డ్రైవర్
- పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదకు దారి మళ్లించిన వైనం
- మహిళ గట్టిగా అరవడంతో డ్రైవర్ పరారీ
- షీ టీమ్స్ కి ఫిర్యాదు చేసిన మహిళ
మల్టీ నేషనల్ కంపెనీ ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై వేధింపులకు దిగాడు. ఓలా క్యాబ్ హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలో ఉండే గౌలిదొడ్డి నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళుతోంది. అందులో ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగిపోయారు. చివరికి ఓ మహిళ మాత్రమే అందులో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఆమెను వేధించిన క్యాబ్ డ్రైవర్.. మొబైల్ నంబర్ ఇవ్వమని అడిగాడు. అనంతరం కారును పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదకు తీసుకెళ్లాడు.
దీంతో ఆ మహిళ గట్టిగా అరిచింది. దీంతో ఆమెను ఆరాంఘర్ చౌరస్తా వద్ద దింపేసిన డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఆ మహిళ ఆటోలో వనస్థలిపురంలోని తన ఇంటికి వెళ్లి, షీ టీమ్స్‌కు ఫోన్ చేసి చెప్పింది. క్యాబ్ డ్రైవర్ వివరాలు తీసుకున్న షీటీమ్స్ ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.