కమలహాసన్: కమలహాసన్ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నారు: డీఎంకే నేత స్టాలిన్

  • కమల్ పై విమర్శలు గుప్పించిన తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్
  • పిచ్చోళ్లు రాజకీయల్లోకి రావడం కుదరదంటూ తీవ్ర వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటన చేస్తున్న ప్రముఖ నటుడు కమలహాసన్ పై తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నేత స్టాలిన్ విమర్శలు గుప్పించారు. కమలహాసన్ ఓ సారి ‘కాకి’ అని, మరోసారి ‘కాషాయం’ అంటూ అయోమయ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో పద్దెనిమిదేళ్లు నిండిన ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లోకి రావచ్చు కానీ, పిచ్చివాళ్లకు మాత్రం ఆ అవకాశం లేదంటూ పరోక్షంగా కమల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా దివంగత సీఎం జయలలిత మృతి వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు. జయలలిత మృతిపై రాష్ట్ర మంత్రులు రోజుకో తీరులో మాట్లాడుతున్నారని, ఆమె మృతికి సంబంధించిన వాస్తవాలు బయటపడాలంటే గవర్నర్ విద్యాసాగర్ రావు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News