ధన్ రాజ్: ధన్ రాజ్ ఇంటికి వెళ్లిన ‘బిగ్ బాస్’ విజేత శివబాలాజీ!

  • ధన్ రాజ్ రెండో బిడ్డను ఎత్తుకుని ముద్దాడిన శివబాలాజీ
  • ధన్ రాజ్ ను అభినందించిన శివబాలాజీ దంపతులు, నటుడు నవదీప్

‘బిగ్ బాస్’ విజేత శివబాలాజీ, తన భార్య మధుమిత, నటుడు నవదీప్ తో కలిసి హాస్యనటుడు ధన్ రాజ్ ఇంటికి వెళ్లారు. రెండో బిడ్డకు తండ్రి అయిన ధన్ రాజ్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఆ బిడ్డను ఎత్తుకుని ముద్దాడారు.

ఈ సందర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ,‘‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్నప్పుడు ధన్ రాజ్ కు కొడుకు పుట్టాడన్న శుభవార్త తెలిసింది. అయితే, తనకు రెండో బిడ్డ పుట్టడానికి నాలుగు రోజుల ముందు నుంచి ధన్ రాజ్ ఆలోచనల్నీ ఇంటి వైపే ఉన్నాయి. దీంతో, చాలా బాధపడేవాడు.

ఆ ధ్యాసలో పడి ‘బిగ్ బాస్’ వంటగదిలో తను పాత్రలు కడిగేటప్పుడు గ్లాసులన్నీ పగలకొట్టేవాడు. మామూలుగా, ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే ఎవరైనా బాధపడతారు. కానీ, ధన్ రాజ్ మాత్రం చాలా సంతోషించాడు.. ఎగిరి గంతేశాడు. ఎందుకంటే, తన బిడ్డను చూసుకోవచ్చని! ఈ షో నుంచి బయటకు రాగానే ధన్ రాజ్ ఇంటికి వెళ్లి, అతని బిడ్డను చూడాలని అనుకున్నాను’ అని శివబాలాజీ చెప్పాడు.

  • Loading...

More Telugu News