‘భారత్ వన్ 4జీ’: అతి తక్కువ ధరకి మైక్రోమ్యాక్స్ నుంచి 4జీ ఫీచర్ ఫోన్!

  • జియోకు పోటీ
  • ‘భారత్ వన్ 4జీ’ పేరిట వచ్చేవారం విడుదల
  • రూ.2 వేలకే లభ్యం
  • బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బండిల్ డేటా ప్యాక్స్ కూడా ఫ్రీ

ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ రూ.2 వేలకే 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. భారత్ వన్ 4జీ పేరిట విడుదల కానున్న ఈ ఫోన్లు వచ్చే వారం నుంచే అందుబాటులో ఉంటాయి. తమ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బండిల్ డేటా ప్యాక్స్ కూడా ఉచితంగా అందుకోవచ్చని మైక్రోమ్యాక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఈ ఫోన్ ఫీచ‌ర్ల గురించి స‌మాచారం అందాల్సి ఉంది. రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్లకు మైక్రోమ్యాక్స్  ఫోన్ పోటీ ఇస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మైక్రోమ్యాక్స్‌కి బీఎస్ఎన్ఎల్ కూడా తోడు కావ‌డంతో మైక్రోమ్యాక్స్ భారత్ వన్ 4జీకు మంచి డిమాండ్ రావ‌చ్చ‌ని చెబుతున్నారు.  

  • Loading...

More Telugu News