ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి: మనసులో ఏదో పెట్టుకుని కలెక్టర్ నాపై ఆరోపణలు చేస్తున్నారు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- అరఎకరం కబ్జా మాట అవాస్తవం
- నాపై ఆరోపణలు నిజమని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమే
- సీఎం కేసీఆర్ కు వివరణ ఇస్తా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా
జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో అర ఎకరం కబ్జా చేశారంటూ కలెక్టర్ శ్రీదేవసేన తనపై చేసిన ఆరోపణలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ‘కలెక్టర్ మనసులో ఏదో పెట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన గజం భూమి కూడా నేను రిజిస్టర్ చేసుకోలేదు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఏ శిక్షకైనా నేను సిద్ధమే. దీనిపై సీఎం కేసీఆర్ కు వివరణ ఇస్తా. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా. తప్పు చేస్తే ప్రజలే శిక్షించి నన్ను ఇంటికి పంపిస్తారు’ అని అన్నారు.