రిలయన్స్: డేటా ఓ కొత్త ఇంధనం.. ఆక్సిజన్ లాంటిది: ముఖేష్ అంబానీ

  • ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ‘రిలయన్స్’ అధినేత
  • నూతన విధానాల కోసం ప్రభుత్వం, టెక్నాలజీ సంస్థలు కలిసి పని చేయాలి
  • దేశీయంగా పెట్టుబడులు పెట్టాలని సూచన

డేటా వినియోగాన్ని అందరికీ కల్పించే లక్ష్యంతో తమ సంస్థ పని చేస్తోందని, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది ఓ కొత్త ఇంధనమని, ఆక్సిజన్ లాంటిదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అన్నారు. ఈ రోజు నిర్వహించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో నూతన విధానాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచేయాలని, దేశీయంగా పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయని అన్నారు.

ప్రతి భారతీయుడికి సాంకేతికతలో అవగాహన కల్పిస్తే, దేశంలో లక్షల సంఖ్యలో స్టార్టప్ లు పుట్టుకొస్తాయని అభిప్రాయపడ్డారు. తొలి మూడు పారిశ్రామిక విప్లవాలను భారత్ ఉపయోగించుకోలేకపోయిందని చెప్పిన ముఖేశ్, నాలుగో పారిశ్రామిక విప్లవం.. ముఖ్యంగా డిజిటల్ యుగం నుంచి ప్రయోజనాలను పొందేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

అందుబాటు ధరల్లో డేటా ఆఫర్లు అందిస్తున్నామని, ఇందుకోసం తక్కువ ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లోకి తీసుకొచ్చామని చెప్పారు. డేటాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం మన దేశానికి లేదని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News