uttham: అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తాం: టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్
- వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం
- టీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతాం
- కేసీఆర్ తీరు వల్లే మెట్రోరైల్ ఆలస్యం
- మెట్రో రైలు చూసేందుకు వెళ్లిన మా నేతలను అడ్డుకున్నారు
తాము అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ సంగతి చూస్తామని టీ- పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు చూసేందుకు వెళ్లిన తమ నాయకులను పోలీసులు అడ్డుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సొత్తు అయిన ఆ ప్రాజెక్టును తాము పరిశీలించకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాము విజయభేరీ మోగించి అధికారంలో వస్తామని చెప్పారు.
తమ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూ.14 వేల కోట్లతో ప్రారంభమైన మెట్రోరైల్ పనులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వల్లే ఆలస్యమయ్యాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్చాలని కేసీఆర్ మొండిగా ప్రవర్తించారని, దీంతో ప్రాజెక్టు ఖర్చు అమాంతం పెరిగిపోయిందని ఆయన అన్నారు.