మహేశ్ బాబు: మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన రోజా


టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబుతో కలిసి దిగిన ఓ ఫొటోను వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, మహేశ్ తో కలిసి ఈ ఫొటోను ఎప్పుడు దిగారన్న విషయాన్ని రోజా ప్రస్తావించలేదు. మహేశ్, రోజా బ్యాక్ గ్రౌండ్ లో ‘స్పైడర్’ మూవీ ఫ్లెక్సీ ఉండటం గమనార్హం.

 కాగా, ‘స్పైడర్’ మూవీ విడుదలకు ముందు ఓ న్యూస్ ఛానెల్ లో మహేశ్ బాబును రోజా ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంలో దిగిన ఫొటో కావచ్చని మహేశ్, రోజా అభిమానులు భావిస్తున్నారు. ఇక, ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి మంచి స్పందనే వచ్చింది. ‘వెరీ నైస్ పిక్.. వెరీ బ్యూటీఫుల్’, ‘అద్భుతం’, ‘మొన్న ఖైదీ నంబర్ 150..ఇవాళ స్పైడర్’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News