kapildev: క్రికెట్ దిగ్గజం నుంచి హార్దిక్ పాండ్యకు ఊహించని కితాబు!

  • పాండ్య నా కంటే ప్రతిభావంతుడు
  • అతను జట్టులో కీలకంగా మారే అవకాశం ఉంది
  • అయితే పాండ్య చాలా కష్టపడాలి
  • అలా కష్టపడితే ఎన్నో ఘనతలు అందుకుంటాడంటున్న కపిల్ 

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నుంచి హార్దిక్ పాండ్యకు ఊహించని కితాబు లభించింది. భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ ది ప్రత్యేక ప్రస్థానం. భారత క్రికెట్ జట్టును విజయాల బాటలో నడపడం, తిరుగులేని పేసర్ గా, అద్భుతమైన ఆల్ రౌండర్ గా పేరు సంపాదించడం కపిల్ దేవ్ కు మాత్రమే సాధ్యమైంది. కపిల్ దేవ్ తరువాత ఎంతో మంది ఆల్ రౌండర్లు జట్టులోకి వచ్చినా అలాంటి ఆల్ రౌండర్ లేని కొరత మాత్రం కనిపిస్తూనే వుంది.

ఇక ఈ మధ్య కాలంలో హార్దిక్ పాండ్య ఆటతీరుతో అందరి ప్రశంసలు పొందుతున్నాడు. దీంతో పలువురి నోట కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్ టీమిండియాకు దొరికాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య గురించి దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. పాండ్య తనకంటే ప్రతిభావంతుడైన క్రికెటర్ అని అన్నాడు. అతనికి ఉన్న ప్రతిభ, సామర్థ్యంతో టీమిండియాకు మరింత కీలకంగా మారే అవకాశం ఉందని ఆయన చెప్పాడు. అయితే అందుకు పాండ్య చేయాల్సిందల్లా కష్టపడడమేనని ఆయన సూచించారు. అలా చేస్తే అతను జట్టులో కీలకమవుతాడని, ఎన్నో ఘనతలు అందుకుంటాడని కపిల్ ఆశీర్వదించాడు. ఈ ప్రశంసలు పాండ్యలో మరింత స్పూర్తిని పెంచుతాయని చెప్పచ్చు. 

  • Loading...

More Telugu News