సీఎం చంద్రబాబు: చంద్రబాబు చిత్ర పటంపై పేపర్ ప్లేట్లు వేసిన ఘటనపై విచారణ ప్రారంభం!

  • ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
  • ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణ
  • అధికారులను, సిబ్బందిని ప్రశ్నించిన ఉదయలక్ష్మి 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటంపై పేపర్ ప్లేట్లు వేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిన్న సమావేశం నిర్వహించిన అధికారులు సహా అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఉదయలక్ష్మి ప్రశ్నించారు.

కాగా, ఉన్నత విద్యాశాఖకు సంబంధించి వెలగపూడి సచివాలయంలోని నాల్గో బ్లాక్ లోని సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులందరికీ అల్పాహారాన్ని పేపర్ ప్లేట్లలో అందజేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న టేబుల్ పై చంద్రబాబు చిత్రపటం ఉంది. అల్పాహారం తిన్న తర్వాత ఆ ప్లేట్లను ఆ చిత్రపటంపై పడవేశారు. సమావేశం అనంతరం ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో, ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, విచారణ చేపట్టాల్సిందిగా ఉదయలక్ష్మిని ఆదేశించడం జరిగింది.

  • Loading...

More Telugu News