క్రికెట్: మా పొరపాట్లే మా కొంపముంచుతున్నాయి!: ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్
- మేము గెలవాలంటే 100 శాతం కృషి చేయాలి
- పొరపాట్లు చేయొద్దు
టీమిండియాతో ఆడిన మూడు వన్డేల్లోనూ ఓడిపోయిన ఆస్ట్రేలియా మిగిలిన రెండు వన్డేల్లోనయినా గెలవాలని భావిస్తోంది. ఎల్లుండి బెంగళూరులో నాలుగో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ టీమిండియాతో గెలవాలంటే 90 శాతం కృషి సరిపోదని, 100 శాతం కృషి చేయాలని అన్నాడు.
మ్యాచ్లు గెలవాలంటే అవకాశాలను ఒడిసిపట్టాలని, పొరపాట్లు చేయకూడదని వ్యాఖ్యానించాడు. తొలి మూడు వన్డేల్లో తాము బాగానే ఆడామని, అయితే తమ పొరపాట్లే తమ కొంప ముంచుతున్నాయని అన్నాడు. ఏమరపాటుగా వుండాలని, చిన్న పొరపాటు కూడా చేయకూడదని, ఒకవేళ పొరపాటు చేస్తే టీమిండియా పదికి తొమ్మిది మ్యాచ్లు కూడా గెలుస్తుందని వ్యాఖ్యానించాడు.