హనిప్రీత్: రిజర్వ్ లో హనిప్రీత్ సింగ్ ముందస్తు బెయిల్ తీర్పు .. లొంగిపోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

  • హనీప్రీత్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి 
  • తీర్పు రిజర్వ్, వెంటనే లొంగిపొమ్మని కోర్టు ఆదేశం

డేరా బాబా దత్త పుత్రికగా చలామణి అవుతున్న హనీ ప్రీత్ సింగ్ కు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ తీర్పును రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు, హనీప్రీత్ వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. కాగా, తనకు ప్రాణహాని ఉందని, పంజాబ్, హర్యానా డ్రగ్ మాఫియా తనను వెంటాడుతోందని తన బెయిల్ పిటిషన్ లో హనిప్రీత్ పేర్కొన్నారు. డేరా బాబా తనకు తండ్రి లాంటి వారని, ఆయన ఏ తప్పూ చేయలేదని, ఈ కేసు విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆ పిటిషన్ లో ఆమె పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News