‘బిగ్ బాస్’: కొంచెం నిరాశ చెందా : ‘బిగ్ బాస్’ రన్నరప్ ఆదర్శ్

  • నెగిటివ్ ఫీలింగ్స్ అయితే లేవు 
  •  ఫైనల్స్ కు వెళ్లడం సంతోషంగా భావించా
  •  ఉత్సాహపరుస్తూ ఫోన్ కాల్స్, మెస్సేజెస్ వస్తున్నాయి

‘బిగ్ బాస్’ సీజన్ -1 ఫైనల్స్ వరకు వచ్చి రన్నరప్ గా నిలవడంతో కొంచెం నిరాశ చెందానని నటుడు ఆదర్శ్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘బిగ్ బాస్’ ఫైనల్స్ వరకు వెళ్లిన నాకు గెలిచే అవకాశం ఉంటుందని అనుకున్నాను. అయితే, రన్నరప్ గా నిలవడంతో ఆ క్షణంలో కొంచెం నిరాశ చెందాను. మనస్ఫూర్తిగా చెబుతున్నాను.. నెగిటివ్ ఫీలింగ్స్ అయితే లేవు. ‘బిగ్ బాస్’ ఫైనల్స్ వరకు రావడం చాలా సంతోషంగా భావించా. ‘బిగ్ బాస్’ ముగియగానే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నన్ను ఉత్సాహపరుస్తూ నాకు చాలా ఫోన్ కాల్స్, మెస్సేజెస్ వస్తున్నాయి. ఫ్యాన్స్ , సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకన్నా గెలుపు ఇంకేముంటుందని నాకు అనిపించింది’ అని ఆదర్శ్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News