స్టాక్ మార్కెట్లు: వరుసగా ఐదోరోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!
- ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసిన యుద్ధ భయం
- 295.81 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 91.80 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యుద్ధ భయంతో మన స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా నష్టాలు చవిచూశాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో 32016.52 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయితే, కాసేపటికే నష్టాలను చవి చూసింది. ఆఖరికి 295.81 పాయింట్లు నష్టపోయి 31626.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 91.80 పాయింట్లు కోల్పోయి 9,872.60 వద్ద స్థిరపడింది.
లూజర్స్:
- అదానీ పోర్ట్స్ -3.29 శాతం
- కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.24%
- లుపిన్ 2.20%
- టాటా స్టీల్ 2.20%
- ఐటీసీ 2.18%
- ఎం అండ్ ఎం 2.11%
- ఎల్ అండ్ టీ 1.71%
- డాక్టర్ రెడ్డీస్ 1.59%
- ఏషియన్ పెయింట్స్ 1.56%
- హెచ్‌డీఎఫ్‌సీ 1.56%
- కోల్ ఇండియా 1.20%
- ఐసీఐసీఐ బ్యాంక్ 0.87%
- హిందుస్థాన్ యునిలీవర్ 0.55%