అరుణ్‌జైట్లీ: శుభవార్త.. ఏపీ సీఎం చంద్రబాబు ప్ర‌తిపాద‌న‌ల‌కు అంగీక‌రించిన అరుణ్‌జైట్లీ

  • తిరుమల దర్శనం టికెట్లపై జీఎస్టీ ఎత్తివేతకు అంగీకారం
  • ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మిన‌హాయింపుపై సానుకూలత
  • పోల‌వ‌రం అంచ‌నాల పెంపును ఆమోదించేందుకు అంగీకారం
  • ఏపీ రెవెన్యూ లోటు భ‌ర్తీపై కేంద్ర ప్ర‌భుత్వం సానుకూలత

ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సీఎం చేసిన ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌కు అరుణ్‌జైట్లీ సానుకూలంగా స్పందించారు. తిరుమల దర్శనం టికెట్లపై జీఎస్టీ ఎత్తివేతకు అంగీకరించారు. ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మిన‌హాయింపు ఇచ్చే అంశంపై కౌన్సిల్‌లో చ‌ర్చిస్తామ‌ని చెప్పారు.

పోల‌వ‌రం అంచ‌నాల పెంపును ఆమోదించేందుకు జైట్లీ సానుకూలంగా స్పందించారు. దీని ప్ర‌కారం పోల‌వ‌రం బ‌కాయిలు రూ.3 వేల కోట్లు చెల్లించేందుకు జైట్లీ అంగీక‌రించారు. మరోవైపు ఏపీ రెవెన్యూ లోటు భ‌ర్తీపై కేంద్ర ప్ర‌భుత్వం సానుకూలత వ్య‌క్తం చేసింది. భ‌ర్తీ అంశాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని పీఎంవో అధికారుల‌కు సూచించింది. దీంతో లోటుపై ఏపీ రాష్ట్ర అధికారుల‌తో కేంద్ర ఆర్థిక శాఖ చ‌ర్చించ‌నుంది. 

  • Loading...

More Telugu News