చంద్రబాబు: ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమల్లోకి తీసుకురావాలి: జైట్లీతో చంద్రబాబు
- ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ
- కాకినాడలో పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ఇబ్బందులు లేకుండా చూడాలి
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని జైట్లీని చంద్రబాబు కోరారు. కాకినాడలో పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని అడిగారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదంపై అరుణ్ జైట్లీతో సీఎం చర్చిస్తున్నారు.