బీహార్ సీఎం: నేను మరణించినా.. మీరు ప్రజలకు సేవ చేయడం మానకూడదు: తమ పార్టీ నేతలతో బీహార్ సీఎం

- నిబంధనలకు కట్టుబడి ఉండాలని పార్టీ నేతలకు నితీశ్ పిలుపు
- అందరినీ ఆశ్చర్యపర్చిన బీహార్ సీఎం వ్యాఖ్యలు
- తన ఆరోగ్యం బాగానే ఉందని నితీశ్ వివరణ
ఒకవేళ తాను మరణించినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ సర్కారు నిబంధనలకు కట్టుబడి ఉండాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. తాను చనిపోయినా ప్రజలకు సేవ చేయడం మానకూడదని తమ నేతలకు చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపర్చాయి. మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కొందరు అడగగా... నితీశ్ కుమార్ స్పందిస్తూ ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. తన ఆరోగ్య విషయంలో మరో పదేళ్లు ఎలాంటి అనుమానాలు వద్దని చెప్పారు. తమ జేడీయూ నేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు.