వైఎస్ రాజశేఖరరెడ్డి: వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుతమైన వ్యక్తి... మా నాన్న ఆయనకు చాలా క్లోజ్!: మహేష్ బాబు


వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుతమైన వ్యక్తి అని హీరో మహేష్ బాబు అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రాజకీయాలను పక్కన పెడితే.. గతంలో నేను ఆయన్ని కలిశాను. మా నాన్న ఆయనకు చాలా క్లోజ్. నేను కలిసినప్పుడు జగన్ గారు కూడా ఉన్నారు. రాజశేఖరరెడ్డి ఓ అద్భుతమైన వ్యక్తి’ అని అన్నాడు. తనకు రాజకీయాల గురించి తెలియదని, అందులోకి రానని ఓ ప్రశ్నకు సమాధానంగా మహేష్ బాబు చెప్పాడు. ‘దూకుడు’ సినిమాలో రాజకీయనాయకుడిగా నటించారు కదా, నిజజీవితంలో పాలిటిక్స్ లోకి రావొచ్చుగా?’ అని ప్రశ్నించగా, సినిమాల్లో నటించడం వరకే తనకు తెలుసని మహేష్ సమాధానమిచ్చాడు.

  • Loading...

More Telugu News