బీజేపీ: తెలంగాణలో భవిష్యత్ భారతీయ జనతా పార్టీదే: బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణలో భవిష్యత్ భారతీయ జనతా పార్టీదేనని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఓ నివేదిక సమర్పించామని చెప్పారు. గుజరాత్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారని, లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని, కాంగ్రెస్ నేతలపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఈ సందర్భంగా లక్ష్మణ్ చెప్పారు.