ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్ లో మహిళలు హైహీల్స్‌ ధరించడంపై నిషేధం

  • హైహీల్స్ తో అనారోగ్య సమస్యలు
  • నిషేధించాలని లేబర్ యూనియన్ వినతి
  • స్పందించిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం

లిప్ స్టిక్స్, హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల బొట్టు బిళ్లలు మొదలైన వస్తువులపై మహిళలు ఎంత మక్కువ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేసే ఉద్యోగినులు అయితే హైహీల్స్ కూడా ధరించి ఆఫీసులకు వెళుతుంటారు. అయితే, దాదాపు 8 నుంచి 10 గంటల పాటు హై హీల్స్ ధరించి పనిచేస్తుండటంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట. ఈ నేపథ్యంలో మహిళలు హైహీల్స్ ధరించడంపై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నిషేధం విధించింది.

వీటిని ధరించడం కారణంగా మహిళలు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారని, వాటిని నిషేధించాలని అక్కడి ప్రభుత్వాన్ని లేబర్ యూనియన్ ప్రతినిధులు కోరారు. ఈ నేపథ్యంలో వారి అభ్యర్థనను పరిశీలించిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హీల్ సైజ్ 2.54 సెంటీమీటర్లకు మించకూడదని ఈ సందర్భంగా ఆదేశించింది.

కాగా, ప్రభుత్వ ఆదేశాలపై లేబర్ యూనియన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. హైహీల్స్ ధరించడం కారణంగా మరింత ఎత్తుగానే కాకుండా ఆకర్షణీయంగా కనబడతారనే కారణాలతో మహిళలు వీటిని ధరించాలని పలు కంపెనీలు భావిస్తుంటాయని, వీటిని ధరించడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయాన్ని మహిళలు గ్రహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా లేబర్ యూనియన్ ప్రతినిధులు కోరారు.

  • Loading...

More Telugu News