రాజమౌళి: ఆస్కార్ రేసులో బాహుబలి-2 లేకపోవడంపై స్పందించిన రాజమౌళి
- ఆస్కార్ రేసులో బాలీవుడ్ మూవీ ‘న్యూటన్’
- అవార్డులు తెచ్చిపెట్టడం కాదు అభిమానులకు నచ్చాలి
- సినిమా నిర్మాతలకి డబ్బులు తెచ్చిపెట్టాలి
- నాకు అసంతృప్తి ఏమీ లేదు
తన ‘బాహుబలి-2’ సినిమా ఆస్కార్ అవార్డుకి నామినేట్ కాకపోడంపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. తన సినిమాలు అవార్డులు తెచ్చిపెట్టడం కాదని, అభిమానులకు నచ్చాలని, సినీ నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్కార్ రేసులో ‘బాహుబలి-2’ కాకుండా బాలీవుడ్ మూవీ ‘న్యూటన్’ నిలిచిన నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ... తన సినిమా ఆస్కార్ రేసులో నిలవకపోవడంపై తాను అసంతృప్తిగా ఏమీ లేనని అన్నారు.
తన లక్ష్యం అవార్డులను పొందడం కాదని, ఆ సినిమా కథతో తాను సంతృప్తి చెందాలని, తరువాత అది సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్షకులను చేరేలా చూస్తానని రాజమౌళి అన్నారు. ఎన్నో రికార్డులు సృష్టించిన బాహుబలి ప్రపంచం నుంచి తానింకా బయటకు రాలేకపోతున్నానని రాజమౌళి వ్యాఖ్యానించారు.