జోగులాంబ గద్వాల జిల్లా: ‘జూరాల’కు జలకళ..పర్యాటకుల వెల్లువ!

  • జూరాల’కు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టం
  • ఇన్ ఫ్లో 1,25,000 క్యూసెక్స్..అవుట్ ఫ్లో 1,08,360 క్యూసెక్స్

తెలంగాణలోని జూరాల జలాశయం జలకళను సంతరించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.16 మీటర్లు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 8.929 టీఎంసీలు. ‘జూరాల’ ఇన్ ఫ్లో 1,25,000 క్యూసెక్స్, అవుట్ ఫ్లో 1,08,360 క్యూసెక్స్. ఈ నేపథ్యంలో, జలకళతో కళకళలాడుతున్న జూరాల జలాశయాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వెళుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News