బిగ్ బాస్: ‘బిగ్ బాస్’ చాలా బాగుంది.. ఆనందంగా ఉంది: 'విజేత' శివబాలాజీ

  • నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు
  • నా కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచి వాళ్లు
  • నేను సాధించిన విజయంలో వాళ్ల పాత్ర ఉందన్న శివబాలాజీ

‘బిగ్ బాస్’ షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ అన్నాడు. ‘బిగ్ బాస్’ ట్రోఫీని, ఫ్రైజ్ మనీని అందుకున్న అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను.

నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు. ఈ సందర్భంగా ‘లవ్ యూ’ అని ఎవరికి చెబుతారు? అని శివబాలాజీని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించగా, ‘హండ్రెట్ పర్సెంట్ మధుకే’ అంటూ తన భార్య పేరును శివబాలాజీ చెప్పడంతో కరతాళధ్వనులు మారుమోగిపోయాయి.

  • Loading...

More Telugu News