ఇండోర్ వన్డే: ఇండోర్ వన్డేలో టీమిండియా విజయం.. సీరీస్ కైవసం!

  • మూడో వన్డేను సొంతం చేసుకున్న భారతజట్టు
  • 3-0 స్కోరుతో టీమిండియా ముందంజ 
  • ఆసీస్ కు నిరాశ

ఇండోర్ వేదికగా ఈ రోజు జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టుపై 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 294 పరుగులు చేసి, విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హార్దిక్ పాండ్యా (78) వీరోచిత పోరాటంతో విజయం టీమిండియా పరమైంది.

కాగా, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ లో వరుసగా మూడింటిని టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో, రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఈ సిరీస్ ను టీమిండియా గెలుచుకున్నట్టయింది. దీంతో, మిగిలిన రెండు మ్యాచ్ లు నామమాత్రంగానే ఆసీస్ జట్టుతో ఆడాల్సి ఉంటుంది. మూడో వన్డేలో టీమిండియా గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇండోర్ స్టేడియం అభిమానుల కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

భారత్ బ్యాటింగ్: రహానె (70), రోహిత్ శర్మ (71), విరాట్ కోహ్లీ (28), పాండ్యా (78), జాదవ్ (2), ఎంకే పాండే 36 పరుగులతో, ధోనీ 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

ఆస్ట్రేలియా బౌలింగ్: కమిన్స్ - 2, కూల్టర్ -నీల్ -1, రిచర్డ్ సన్ - 1, అగర్ - 1

  • Loading...

More Telugu News