శర్మ: క్రికెట్ అప్ డేట్స్: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..టీమిండియా స్కోరు 100/0
- నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
- అభిమానుల చప్పట్లతో మార్మోగుతున్న ఇండోర్ స్టేడియం
భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 42 బంతుల్లో రోహిత్ శర్మ 50 పరుగులు పూర్తి చేసి తన సత్తా చాటాడు. 15 ఓవర్లు ముగిసేసరికి శర్మ 57 పరుగులతో, రహానె 40 పరుగులతో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 100/0. కాగా, టీమిండియా ఓపెనర్ల ఆట తీరుకు స్పందిస్తున్న అభిమానుల చప్పట్లతో ఇండోర్ స్టేడియం మార్మోగిపోతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.