మూడో వన్డే: రోహిత్ శర్మ దూకుడు.. స్కోర్ బోర్డు పరుగులు!
- చెలరేగుతున్న టీమిండియా ఓపెనర్లు
- ఆసీస్ బౌలర్లను చెండాడుతున్న శర్మ, రహానే
మూడో వన్డేలో 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఇప్పటికే 42 పరుగులు చేయగా, రహానే 27 పరుగులతో కొనసాగుతున్నారు. రోహిత శర్మ ఇప్పటికే మూడు ఫోర్లు, మూడు సిక్స్ లు బాదగా, రహానే నాలుగు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం 10.4 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు స్కోర్ 71/0. కాగా, ఆసీస్ బౌలర్లు స్టాయినిస్, కూల్టర్ - నీల్, రిచర్డ్ సన్ బౌలింగ్ లో టీమిండియా ఓపెనర్లు చెలరేగి ఆడుతుండటం గమనార్హం.