జూనియర్ ఎన్టీఆర్: జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం: హాస్యనటుడు పృథ్వీరాజ్
- ఫేస్ బుక్ పోస్ట్ చేసిన పృథ్వీరాజ్
- యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు శాల్యూట్
- తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఉత్తమ నటుల్లో ఆయన కూడా ఒకరు
బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం ప్రేక్షకుల, అభిమానుల మన్ననలు పొందుతున్న నేపథ్యంలో హాస్యనటుడు పృథ్వీరాజ్ స్పందించాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రశంసిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో పృథ్వీరాజ్ ఓ పోస్ట్ చేశాడు. ‘యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు శాల్యూట్. పవర్ హౌస్ లాంటి టాలెంట్ ను కలిగి ఉన్న ఆయన, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఉత్తమ నటుల్లో ఒకరు. జై లవ కుశ చిత్రంలో ఆయన నటనా కౌశలం చూసి సంతోషపడ్డా’ అని పృథ్వీరాజ్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.