మూడో వన్డే: ఫించ్ సెంచరీ.. పరుగులు పెడుతున్న స్కోర్ బోర్డు!

  •  కొనసాగుతున్న ఫించ్, స్మిత్ ల భాగస్వామ్యం
  •  ద్విశతకం దాటిన ఆసీస్ స్కోరు

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తోంది. ఏజె ఫించ్, స్మిత్ ల భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫించ్ 109 పరుగులతో, స్మిత్ 45 పరుగులతో కొనసాగుతున్నారు. ఆసీస్ తొలి వికెట్ వార్నర్ ఔటయిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన స్మిత్, వార్నర్ తో కలిసి పటిష్ట భాగస్వామ్యాన్ని అందిస్తున్నాడు. 34.5 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 206 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News