అరుణ్ జైట్లీ: అరుణ్ జైట్లీ ప్రసంగానికి అడ్డు తగిలిన వ్యక్తి.. మండిపడ్డ మంత్రి
- ఢిల్లీలో చోటుచేసుకున్న సంఘటన
- ‘మంత్రి గారూ! బుల్లెట్ ట్రెయిన్ ని హిందీలో ఏమంటారు?’ అంటూ ప్రశ్నించిన ఓ వ్యక్తి
- ప్రసంగం మధ్యలో ఆటంకం కల్గించొద్దంటూ జైట్లీ ఆగ్రహం
ఓ వ్యక్తిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ఓ సెమినార్ లో బుల్లెట్ ట్రెయిన్ గురించి ఆయన ప్రసంగిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ అంశంపై అరుణ్ జైట్లీ సీరియస్ గా ప్రసంగిస్తున్న సమయంలో ‘బుల్లెట్ ట్రెయిన్ ని హిందీలో ఏమంటారు?’ అని మంత్రిని సదరు వ్యక్తి ప్రశ్నించాడు.
దీంతో, ఆగ్రహించిన అరుణ్ జైట్లీ.. ప్రసంగం మధ్యలో ఈ విధంగా అడ్డుతగలడం మంచిది కాదని, సీరియస్ గా ఉండాలంటూ ఆ వ్యక్తిని మందలించినట్టు సమాచారం. హిందీ భాషలో ప్రసంగించే సమయంలో మధ్యమధ్యలో ఇంగ్లీషు పదాలను ఎందుకు వినియోగిస్తున్నారంటూ సదరు వ్యక్తి జైట్లీతో అన్నట్టు సమాచారం.