‘జై లవ కుశ’: ‘జై లవ కుశ’ కలెక్షన్స్ పై దర్శకుడు బాబీ హ్యాపీ!
- సెన్సేషనల్ బ్లాక్ బస్టర్
- ‘జై లవ కుశ’ బాక్సాఫీసు సింహాసనా'
- విడుదలైన మూడు రోజుల్లోనే రూ.75 కోట్లకు పైగా రాబట్టిన చిత్రమంటూ బాబీ ట్వీట్
జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవ కుశ’ చిత్రం బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు బాబీ సంతోషం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేయడంతో పాటు ‘జై లవ కుశ’ కొత్త పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ‘రావణా బాక్సాఫీసు సింహాసనా’ అని ప్రశంసించారు.
సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైబడి రాబట్టిందని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ లు నటించగా, పోసాని కృష్ణమురళీ, సాయికుమార్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.