చంద్రబాబు: వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
- ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభం
- ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేసిన వేదపండితులు
- ఏపీ సీఎంకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేదపండితులు
- సంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టిన ఆలయ అర్చకులు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. శ్రీవారి సర్వసైన్యాధిపతి విష్వక్సేనుడు సుదర్శన చక్రత్వాళార్, పరివార దేవతలతో తిరుమాడ వీధుల్లో గరుడ ధ్వజపటం ఊరేగింపు జరిపారు. ధ్వజపటం ఆలయంలోకి చేరుకోగానే ధ్వజస్తంభం వద్ద పెద్ద పూమాలకు అలంకరించి, అక్కడ ఉన్న గరుడి విగ్రహానికి అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
అనంతరం ఈ ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టారు. ఆయనకు వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.