పారిపోయిన వరుడు: ఇటు పెళ్లి మండపంలో వధువు బంధువుల ఎదురుచూపులు.. అటు వరుడు జంప్!

  • పెళ్లి కొడుకుకి ఇప్పటికే అందిన 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ క‌ట్నం
  • ఇంటికి తాళం వేసుకుని పారిపోయిన పెళ్లికొడుకు
  • పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపుడి మండలం తిరుగురు మెట్టలో ఘటన

పెళ్లి చూసి, నూతన దంపతులపై అక్షింతలు వేద్దామ‌ని అమ్మాయి త‌ర‌ఫు బంధువులు అంతా వ‌చ్చారు. పెళ్లి మండ‌పంలో అంతా సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌రికాసేప‌ట్లో త‌మ కూతురు ఓ ఇల్లాలు కాబోతుంద‌ని పెళ్లికూతురి త‌ల్లిదండ్రులు ముచ్చ‌టప‌డుతున్నారు. పెళ్లి కొడుకుకి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ క‌ట్నం ఇప్ప‌టికే ఇచ్చామ‌ని, పెళ్లికాగానే మ‌రో 5 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వ‌నున్నామ‌ని చెప్పుకున్నారు. ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేసుకుని కూర్చున్నారు. అయితే, ఎంత‌గా ఎదురు చూసినా పెళ్లి కొడుకు మండ‌పానికి రాలేదు. దీంతో వ‌ధువు బంధువులు అతని ఇంటికి వెళ్లి చూశారు.

అత‌డి ఇంటికి తాళం ఉంది. వారు చుట్టు పక్కల వారిని వరుడి గురించి అడ‌గ‌గా, ఆ యువ‌కుడు ఎక్క‌డికో పారిపోయాడ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని  తాళ్లపుడి మండలం తిరుగురు మెట్టలో చోటు చేసుకుంది. వ‌రుడు ఎర్రమాల రాజేష్ పారిపోవ‌డంతో పెళ్లి ర‌ద్ద‌యింది. ఆ వ‌రుడు ఎందుకు పారిపోయాడో, ఎక్క‌డికి వెళ్లాడో తెలియాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News