'సామాజిక సేవకులు వైశ్యులు': ఐలయ్య పుస్తకం వివాదం నేపథ్యంలో... 'సామాజిక సేవకులు వైశ్యులు' పుస్తకం విడుదల!

  • హైదరాబాద్ లో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం
  • కంచ ఐల‌య్య‌పై కొనసాగుతోన్న ఆర్య‌వైశ్యుల నిర‌స‌న

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ ప్రొ.కంచ ఐలయ్య రాసిన పుస్తకం వివాదాస్పదమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ పుస్త‌కానికి కౌంట‌ర్‌గా ఈ రోజు హైదరాబాద్ లో ‘సామాజిక సేవకులు వైశ్యులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వైశ్యులు స‌మాజానికి చేస్తోన్న సేవ‌ల‌ను ఈ పుస్త‌కంలో పొందుపర్చారు. కాగా, కంచ ఐల‌య్య‌పై ఆర్య‌వైశ్యుల నిర‌స‌న కొన‌సాగుతోంది. ఐల‌య్య రాసిన పుస్తకంపై నిషేధం విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News