పీవీ సింధు: ఆటలో నేను చేస్తోన్న తప్పులు నిన్నటివరకు తెలియలేదు: పీవీ సింధు

  • కొంత విశ్రాంతి తీసుకుని ‌మళ్లీ ట్రైనింగ్‌కు వెళ‌తా
  • ఇక డెన్మార్క్ ఓపెన్‌పై దృష్టి పెడ‌తా
  • సోషల్ మీడియా ద్వారా స్పందించిన సింధు 

ఇటీవలే కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌‌ని సాధించిన భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు జపాన్ ఓపెన్‌లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో జ‌పాన్ ఓపెన్ సిరీస్‌లోనూ ఆమె రాణిస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో త‌న ఓట‌మిపై పీవీ సింధు సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది.

నిన్న జ‌పాన్‌ క్రీడాకారిణి నొజొమి ఒకుహర చేతిలో ఓటమి పొందేవ‌ర‌కు ఆట‌లో తాను చేస్తోన్న త‌ప్పులేంటో త‌న‌కు తెలియ‌రాలేద‌ని ఆమె చెప్పింది. ప్ర‌స్తుతం తాను కొంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంద‌ని, అనంత‌రం మ‌ళ్లీ ట్రైనింగ్‌కు వెళ‌తాన‌ని పేర్కొంది. ఇక తాను డెన్మార్క్ ఓపెన్‌పై దృష్టి పెడ‌తాన‌ని చెప్పింది. 

  • Loading...

More Telugu News