Ragavendrarao: నటన అనేది మనిషి అయితే, దానికి ప్రాణం మా జూ.ఎన్టీఆర్!: రాఘవేంద్రరావు ప్రశంసలు
- ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ నటనపై టాలీవుడ్ దర్శకుల ప్రశంసల జల్లు
- ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నా: రాఘవేంద్రరావు
- తారక్ దున్నేశాడు.. శుభాకాంక్షలు: గోపిచంద్ మలినేని
‘జై లవకుశ’లో జూనియర్ ఎన్టీఆర్ నటనపై టాలీవుడ్ దర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. 'జై లవకుశ'లో తారక్ నటన అమోఘం. ‘జై’ ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంటూ, ఎన్టీఆర్ నటనను కొనియాడారు.
ఇక ఈ సినిమాలో జై పాత్రలో ఎన్టీఆర్ ను తప్ప మరెవరినీ ఊహించుకోలేమని యువ దర్శకుడు గోపీచంద్ మలినేని పేర్కొన్నారు. ‘తారక్ దున్నేశాడు.. శుభాకాంక్షలు’ అని ఆయన అన్నాడు. ఈ సినిమాలో ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటనపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.