ఆదిమూలం సురేశ్: వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేశ్‌, ఆయన సతీమణిపై సీబీఐ కేసు నమోదు

  • ఆదిమూలం సురేశ్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే
  • ఆయన సతీమణి ఐఆర్‌ఎస్‌ అధికారిణి 
  • వారివద్ద ఆదాయానికి మించి రూ.కోటికి పైగా ఆస్తులు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేశ్‌తో పాటు ఆయన భార్య విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారివద్ద ఆదాయానికి మించి రూ.కోటికి పైగా ఆస్తులు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన సురేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భార్య‌ విజయలక్ష్మి ఐఆర్‌ఎస్‌ అధికారిణిగా పనిచేస్తున్నారు.   

  • Loading...

More Telugu News