ప్లాట్‌ఫాం టికెట్: విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు

  • పండుగల సెలవులను దృష్టిలో ఉంచుకుని ధరల పెంపు
  • రూ.10గా ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ ధ‌ర రూ.20 కి పెంపు
  • ఈ నెల 23 నుంచి అక్టోబ‌రు 4 వ‌ర‌కు అమలులో ఉండనున్న ధరలు

పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఈనెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచిన విష‌యం తెలిసిందే. అదే విధంగా విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్‌లోనూ ప్లాట్‌ఫాం టికెట్ ధ‌ర పెరిగింది. ప్ర‌స్తుతం రూ.10 గా ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ ధ‌రను రూ.20 పెంచారు. పెంచిన ధ‌ర‌లు ఈ నెల 23 నుంచి అక్టోబ‌రు 4 వ‌ర‌కు అమ‌లులో ఉంటాయి. అనవసర రద్దీని నివారించడానికి అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  

  • Loading...

More Telugu News