క్రికెట్: కోల్‌కతా వన్డేలో కుల్‌దీప్ యాదవ్ రికార్డు.. హ్యాట్రిక్ వికెట్స్.. విజయానికి చేరువలో టీమిండియా!
- 36 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 8 వికెట్లకి 162
- చేతులెత్తేసిన కంగారూలు
- అద్భుతంగా రాణిస్తోన్న టీమిండియా బౌలర్లు
- వన్డేల్లో హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా మూడవ బౌలర్‌గా కుల్‌దీప్
కోల్‌కతా వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్ముదులిపేశారు. ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఓటమికి చేరువైంది. టీమిండియా తమ ముందు ఉంచిన 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేస్తోన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో స్టీవెన్ స్మిత్ (59) మినహా అందరూ చేతులెత్తేశారు.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో హిల్టన్ కార్ట్‌రైట్ 1, డేవిడ్ వార్నర్ 1, ట్రావిస్ హెడ్ 39, మ్యాక్స్‌వెల్ 14 ఔటైన అనంతరం బౌలింగ్ చేసిన కుల్‌దీప్ యాదవ్.. మాథ్యూ వేడ్ 2, అగర్ 0, కమ్మిన్స్ 0 వికెట్లను వరుసగా తీసి హ్యాట్రిక్ నమోదు చేసుకుని రికార్డు సృష్టించాడు. వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన టీమిండియా మూడవ బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ ఘనతను చేతన్ శర్మ, కపిల్ దేవ్ మాత్రమే సాధించారు. 36 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 8 వికెట్లకి 162 గా ఉంది. ప్రస్తుతం క్రీజులో స్టోయినిస్ 35, నైల్ 0 పరుగులతో ఉన్నారు.