కంచ ఐలయ్య: ఐలయ్యపై కేసులు నమోదై ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు: తెలంగాణ హోం మంత్రి
- ఇప్పటికే పలుచోట్ల పోలీసులకు ఆర్యవైశ్యుల ఫిర్యాదు
- బతుకమ్మ చీరలపై ప్రతిపక్ష నేతల కుట్ర
- ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లు చీరలను తగులబెట్టించారు
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అని పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యులు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. ఐలయ్యపై కేసులు నమోదై ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్యులు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రతిపక్ష పార్టీల నేతలు తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని నాయిని అన్నారు. బతుకమ్మ చీరలపై ప్రతిపక్ష నేతలు కుట్ర చేశారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లు చీరలను తగులబెట్టించారని తెలిపారు.